-->

గ్రామ పంచాయతీ ప్రజా ప్రతినిధుల కరదీపిక ఆవిష్కరణ

గ్రామ పంచాయతీ ప్రజా ప్రతినిధుల కరదీపిక ఆవిష్కరణ సీఎం ఎ. రేవంత్ రెడ్డి చేతుల మీదుగా విడుదల


హైదరాబాద్: గ్రామ పంచాయతీ ప్రజా ప్రతినిధుల విధులు, బాధ్యతలపై సమగ్ర సమాచారంతో రూపొందించిన **గ్రామ ‘పంచాయతీ ప్రజా ప్రతినిధుల కరదీపిక’**ను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు.

పంచాయతీ రాజ్ చట్టం–2018 ప్రకారం గ్రామ పంచాయతీలకు సంబంధించిన విధులు, అధికారాలు, బాధ్యతలను సమగ్రంగా వివరించేలా 292 పేజీలతో ఈ కరదీపికను తెలంగాణ గ్రామీణాభివృద్ధి సంస్థ (TGIRD) రూపొందించింది. గ్రామస్థాయిలో ప్రజాపాలన మరింత సమర్థవంతంగా సాగేందుకు ఈ పుస్తకం మార్గదర్శకంగా ఉపయోగపడనుంది.

ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ధనసరి అనసూయ (సీతక్క), జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, వాకిటి శ్రీహరి, మహమ్మద్ అజారుద్దీన్ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, అలాగే ఉన్నత ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.

ఈ కరదీపికను రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రామ పంచాయతీ ప్రజా ప్రతినిధులందరికీ ప్రభుత్వం అందజేయనుంది. ఇది గ్రామ పాలనలో పారదర్శకత, బాధ్యత, ప్రజాసేవను మరింత బలోపేతం చేస్తుందని అధికారులు పేర్కొన్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793