-->

మున్సిపల్ ఎన్నికల్లో సింహం గుర్తుపై తెలంగాణ జాగృతి అభ్యర్థులు

తెలంగాణ జాగృతి–ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ మధ్య రాజకీయ అవగాహన


హైదరాబాద్, జనవరి — (న్యూస్ డెస్క్): రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ సింహం గుర్తుపై తెలంగాణ జాగృతి ఔత్సాహిక అభ్యర్థులు పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సమక్షంలో ఈ కీలక నిర్ణయాన్ని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తెలంగాణ రాష్ట్ర చైర్మన్ జావెద్ లతీఫ్, ఉపాధ్యక్షులు కె. బుచ్చిరెడ్డి అధికారికంగా వెల్లడించారు.

బుధవారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో తెలంగాణ జాగృతి, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నేతలు విస్తృతంగా చర్చలు జరిపారు. మున్సిపల్ ఎన్నికలలో పరస్పర సహకారంతో ముందుకు సాగడమే కాకుండా, భవిష్యత్తులోనూ రెండు సంస్థలు కలిసి పనిచేయాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

ఈ సమావేశంలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర చైర్మన్ జావెద్ లతీఫ్‌తో పాటు కన్వీనర్ జోజిరెడ్డి, ఉపాధ్యక్షుడు బుచ్చిరెడ్డి, సెంట్రల్ కమిటీ సభ్యులు ఆర్‌వీఆర్ ప్రసాద్, తేజ్ దీప్ రెడ్డి, కొండ దయానంద్, ప్రధాన కార్యదర్శి కోమటిరెడ్డి తేజ్ దీప్ రెడ్డి, ఫైనాన్స్ సెక్రటరీ కె. నరేందర్ పాల్గొన్నారు.

అలాగే నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజు గౌడ్, సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి బీరన్న, నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శి రాము, ఐవైఎల్ స్టేట్ ప్రెసిడెంట్ ఆదిత్య, జనరల్ సెక్రటరీ కృష్ణమూర్తి సహా పలువురు ముఖ్య నేతలు హాజరయ్యారు.

ఈ రాజకీయ అవగాహనతో మున్సిపల్ ఎన్నికల్లో ప్రజాసమస్యలపై పోరాటాన్ని మరింత బలోపేతం చేయాలని, స్థానిక సంస్థల్లో ప్రజాస్వామ్య విలువలను కాపాడే దిశగా కలిసి పనిచేస్తామని నేతలు స్పష్టం చేశారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793