-->

తెలంగాణ కుంభమేళా మేడారం జాతరలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రత్యేక దర్శనం

తెలంగాణ కుంభమేళా మేడారం జాతరలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రత్యేక దర్శనం


తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం సమ్మక్క–సారలమ్మల మహాజాతరకు డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సతీసమేతంగా హాజరై అమ్మవార్లను దర్శించుకున్నారు. అశేష భక్తజన సందోహం మధ్య వనదేవతల గద్దెల వద్ద మొక్కులు చెల్లించి, రాష్ట్ర ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని ఆయన మనస్ఫూర్తిగా ప్రార్థించారు.

ఈ కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఆద్లూరి లక్ష్మణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవార్ల ఆశీస్సులు రాష్ట్ర ప్రజలపై ఉండాలని వారు ఆకాంక్షించారు.

మేడారం మహాజాతర సందర్భంగా కోట్లాదిగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడటమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను సందర్శించి, భద్రత, పారిశుధ్యం, ట్రాఫిక్ నిర్వహణపై అధికారులకు కీలక సూచనలు చేశారు.

భక్తుల సౌకర్యార్థం ప్రతి అడుగులోనూ ప్రభుత్వం అండగా ఉంటుందని, మహాజాతరను ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793