-->

మున్సిపల్ ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్

మున్సిపల్ ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్ గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ వ్యూహాత్మక అడుగులు


తెలంగాణలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ వ్యూహాలను పదునుపెడుతోంది. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఫిబ్రవరి 4 నుంచి జిల్లాల పర్యటనలకు సిద్ధమయ్యారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఫిబ్రవరి 4న మిర్యాలగూడలో తొలి ప్రచార సభ నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 5న చొప్పదండిలో మున్సిపల్ ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారు. ఫిబ్రవరి 6న నిజామాబాద్ రూరల్ పరిధిలో సీఎం పర్యటన జరగనుంది.

అదేవిధంగా ఫిబ్రవరి 7న పరిగి, ఫిబ్రవరి 8న భూపాలపల్లిలో ఎన్నికల సభలు నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 9న మెదక్‌లో కీలక ఎన్నికల సభతో ప్రచారాన్ని ఉద్ధృతం చేయనున్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేసిన పథకాలు, సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే ఈ పర్యటనల ప్రధాన లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఇప్పటికే పార్టీ కేడర్‌కు స్పష్టమైన దిశానిర్దేశం చేసిన ఆయన, క్షేత్రస్థాయిలో బలంగా పనిచేయాలని నేతలకు సూచించారు.

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరేయాలనే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం వెల్లివిరుస్తోంది.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793