పదో తరగతి ప్రతిభావంతులకు రూ.2.20 కోట్ల నగదు ప్రోత్సాహకాలు అభినందనీయం
తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్ పాఠశాలల్లో చదివి పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు రూ.2.20 కోట్ల నగదు బహుమతులు అందించేందుకు శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ ముందుకు రావడం అభినందనీయమని జాగృతి అధ్యక్షులు కల్వకుంట్ల కవిత అన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులను చదువులో మరింత ప్రోత్సహించేందుకు ఈ ప్రైవేటు సంస్థ చూపుతున్న చొరవ ప్రశంసనీయమని ఆమె పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాలు వేలాది మంది విద్యార్థుల్లో పోటీతత్వాన్ని పెంపొందించడంతో పాటు, మెరుగైన ఫలితాలు సాధించేందుకు ఉత్ప్రేరకంగా పనిచేస్తాయని తెలిపారు.
విద్యా రంగంలో సామాజిక బాధ్యతతో ముందుకు వస్తున్న శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ ప్రయత్నాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్లు కల్వకుంట్ల కవిత తెలిపారు.

Post a Comment