-->

తెలంగాణ ఆరోగ్యశాఖ కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు శుభవార్త.. ఇకపై ప్రతి నెల 1వ తేదీనే జీతాలు

తెలంగాణ ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతి నెల 1వ తేదీనే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (డీబీటీ) ద్వారా ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా వేతనాలు జమ చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.

ఈ నిర్ణయంతో వేతనాల చెల్లింపులో జాప్యం తగ్గి, ఉద్యోగులకు సకాలంలో జీతాలు అందనున్నాయి. అయితే, తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ) పరిధిలో పనిచేస్తున్న సుమారు 1,700 మంది ఉద్యోగులకు సాంకేతిక కారణాల వల్ల ఈ నెల వేతనాల చెల్లింపులో స్వల్ప ఆలస్యం జరిగినట్లు అధికారులు తెలిపారు.

ఆ ఉద్యోగులందరికీ సోమవారం నాటికి వేతనాలు వారి బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయని ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. డీబీటీ విధానం అమలుతో వేతనాల పంపిణీ మరింత పారదర్శకంగా, వేగంగా జరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793