-->

లగ్జరీ రిసార్ట్‌లో సెక్స్ రాకెట్ గుట్టురట్టు.. 52 మంది అరెస్ట్

 

లగ్జరీ రిసార్ట్‌లో సెక్స్ రాకెట్ గుట్టురట్టు.. 52 మంది అరెస్ట్

లగ్జరీ రిసార్ట్‌లో సెక్స్ రాకెట్ గుట్టురట్టు.. 52 మంది అరెస్ట్

ఉత్తరాఖండ్‌లోని జిమ్ కార్బెట్ జాతీయ ఉద్యానవనం సమీపంలోని రామ్‌నగర్‌లో ఉన్న ఓ లగ్జరీ రిసార్ట్‌లో నిర్వహిస్తున్న భారీ సెక్స్ రాకెట్‌ను పోలీసులు ఛేదించారు. రేవ్ పార్టీ జరుగుతున్న సమయంలో దాడులు నిర్వహించి 52 మందిని అదుపులోకి తీసుకున్నారు.

దాడిలో ఒక మైనర్ బాలికతో పాటు మొత్తం 10 మంది మహిళలను పోలీసులు రక్షించారు. విచారణలో ఇతర రాష్ట్రాలతో పాటు విదేశాల నుంచి కూడా మహిళలను తీసుకొచ్చి, మద్యం పార్టీలతో పాటు అసభ్య నృత్యాలు నిర్వహిస్తూ వ్యభిచారాన్ని ప్రోత్సహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

ప్రాథమిక దర్యాప్తులో ప్రతి మహిళకు రూ.10 వేల చొప్పున రేటు నిర్ణయించినట్లు, ఈ కార్యక్రమం కోసం రిసార్ట్‌ను సుమారు రూ.2.20 లక్షలకు బుక్ చేసినట్లు వెల్లడైంది. ఘటనాస్థలం నుంచి భారీ మొత్తంలో మద్యం, అభ్యంతరకర వస్తువులు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఘటనపై రిసార్ట్ యజమాన్యంపై కూడా కేసులు నమోదు చేశారు. భారతీయ న్యాయ సంహిత (BNS), వ్యభిచార నిరోధక చట్టం, పోక్సో చట్టం, ఎక్సైజ్ చట్టం తదితర నిబంధనల కింద కేసులు నమోదు చేసి రిసార్ట్‌ను సీజ్ చేశారు.

టూరిజం పేరుతో చట్టవిరుద్ధ కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ ముఠాను భగ్నం చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారంలో మరికొందరి ప్రమేయంపై దర్యాప్తు కొనసాగుతోంది.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793