కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో ఘనంగా జ్యేష్ఠాభిషేక మహోత్సవం
కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో ఘనంగా జ్యేష్ఠాభిషేక మహోత్సవం
జగిత్యాల, జూలై 6: జగిత్యాల జిల్లా మాల్యాల మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానంలో జ్యేష్ఠ మాసాన్ని పురస్కరించుకుని సోమవారం జ్యేష్ఠాభిషేక మహోత్సవాన్ని భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయ అర్చకులు వేదమంత్రోచ్చారణల నడుమ పంచామృతాభిషేకం, ప్రత్యేక అర్చనలు, పూజలు నిర్వహించారు. అనంతరం 108 కలశాలతో విశేష పూజలు నిర్వహించి స్వామివారికి మహాభిషేకం చేశారు.
మహోత్సవాన్ని తిలకించేందుకు తెలంగాణ నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు.
ఆలయ ఈఓ ఎస్. అంజనారెడ్డి ఆధ్వర్యంలో అధికారులు, అర్చకులు, వేద పండితులు, సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు.

Post a Comment