ఓలా ఎలక్ట్రిక్ షోరూంలో అగ్నిప్రమాదం.. 10 బైకులు దగ్ధం
ఖమ్మం నగరంలోని రోటరీ నగర్ ప్రాంతంలో ఉన్న Ola Electric బైక్ షోరూంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో సుమారు రూ.10 లక్షల విలువైన ఎలక్ట్రిక్ బైకులు మంటల్లో కాలిపోయినట్లు షోరూం యాజమాన్యం వెల్లడించింది.
సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదంలో రెండు బైకులు పూర్తిగా దగ్ధమయ్యాయి. మరో ఎనిమిది బైకులు పాక్షికంగా దెబ్బతిన్నాయి.
అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
స్థానికుల సమాచారం ప్రకారం షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. అధికారులు పూర్తి వివరాలను సేకరిస్తున్నారు.

Post a Comment