జాతీయ మెగా లోక్ అదాలత్‌లో 8,120 కేసులు పరిష్కారం
రామగుండం, మార్చి 28: జాతీయ మెగా లోక్ అదాలత్ సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో భారీ స్థాయిలో కేసులు పరిష్కారమయ్యాయి. పెద్దపల్లి, మంచిర్యాల జోన్ల పరిధిలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మొత్తం 8,120 కేసులు విజయవంతంగా పరిష్కరించబడ్డాయి.
ఈ సందర్భంగా అండర్ ఇన్వెస్టిగేషన్ మరియు కోర్టు విచారణలో ఉన్న 674 IPC కేసులు, 17 SLL కేసులు పరిష్కరించబడ్డాయి. అలాగే
- ఇ-పెట్టి కేసులు: 2,537
- డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు: 4,892పరిష్కారం కావడం విశేషం.
సైబర్ నేరాలకు సంబంధించిన కేసుల్లో కూడా బాధితులకు ఉపశమనం లభించింది.
- కమిషనరేట్ పరిధిలోని 75 కేసుల్లో రూ.33,10,325
- సీసీపీఎస్ పోలీస్ స్టేషన్, రామగుండంలో నమోదైన 9 కేసుల్లో రూ.27,90,301మొత్తంగా 84 సైబర్ కేసుల్లో రూ.61,00,626 బాధితులకు తిరిగి అందజేయబడింది.
ఈ విషయాన్ని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. లోక్ అదాలత్ ద్వారా చిన్నపాటి చట్టపరమైన కేసులు వేగంగా పరిష్కారమవడంతో ప్రజలకు సమయం, ఖర్చు ఆదా అవుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రాజీ మార్గాన్ని ఎంచుకోవడం వల్ల ఈ విజయవంతమైన ఫలితాలు సాధ్యమయ్యాయని అన్నారు.
గత 15 రోజులుగా అధికారులు, కోర్టు సిబ్బంది కేసుల పక్షాలను కలుసుకుని అవగాహన కల్పించడం వల్ల లక్ష్యానికి మించి కేసులు పరిష్కరించగలిగామని తెలిపారు. ఈ విజయానికి కృషి చేసిన పోలీస్ సిబ్బంది, న్యాయమూర్తులు, జిల్లా న్యాయ సేవా సంస్థకు కమిషనర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
లోక్ అదాలత్ విజయవంతం కావడానికి కృషి చేసిన అధికారులకు త్వరలోనే బహుమతులు అందజేస్తామని ఆయన వెల్లడించారు.

Post a Comment