-->

దిశ ఉమెన్ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా ఇఫ్తార్ విందు

దిశ ఉమెన్ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా ఇఫ్తార్ విందు


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: దిశ ఉమెన్ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. సంస్థ చైర్‌పర్సన్ వాసర్ల నాగమణి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పేద మహిళలకు చీరలను పంపిణీ చేసి సేవా భావాన్ని చాటుకున్నారు.


ఈ సందర్భంగా జమాతే ఇస్లామీ హింద్ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు శానాజ్ జహంగిరి ముఖ్య అతిథిగా పాల్గొని రమజాన్ నెల విశిష్టత, ఉపవాసాల ప్రాముఖ్యతపై వివరించారు. సమాజంలో పరస్పర సహకారం, సహన భావం పెంపొందించుకోవాలని సూచించారు.

కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిథులను నిర్వాహకులు షాలువాలతో ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో రామావరం జమాతే ఇస్లామీ హింద్ మహిళా వింగ్ సభ్యురాలు పర్వీన్, దిశ ఉమెన్ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ జిల్లా అధ్యక్షురాలు రెంటపల్లి మాధవిలత, ఆర్గనైజేషన్ సెక్రటరీ బోగా లక్ష్మి, సెక్రెటరీ  బి. మాలతి, ఖాజా బేగం తదితరులు పాల్గొన్నారు. ఈ ఇఫ్తార్ విందు కార్యక్రమం సామాజిక ఐక్యతకు నిదర్శనంగా నిలిచింది.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793