-->

గోదావరిఖనిలో జమాత్-ఎ-ఇస్లామీ హింద్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు

గోదావరిఖనిలో జమాత్-ఎ-ఇస్లామీ హింద్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు


గోదావరిఖని: జమాత్-ఎ-ఇస్లామీ హింద్ గోదావరిఖని యూనిట్ ఆధ్వర్యంలో మంగళవారం (మార్చి 17) సాయంత్రం 5 గంటలకు లక్ష్మీనగర్‌లోని జామియా మస్జిద్ వద్ద ఉన్న JIH కార్యాలయంలో ఘనంగా ఇఫ్తార్ విందు నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా మొహమ్మద్ ఫాసియుద్దీన్ హాజరై రంజాన్ నెల యొక్క ప్రాముఖ్యత, ఉపవాసం ద్వారా ఆత్మశుద్ధి, సమాజంలో సహనం, సహకారం పెంపొందించుకోవాల్సిన అవసరంపై ప్రసంగించారు. ఆయన ప్రస్తుతం జామియా మసీదు అధ్యక్షుడిగా, గోదావరిఖని షరియత్ పంచాయతీ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

గౌరవ అతిథిగా ఖాజీ మొహమ్మద్ ఇస్మాయిల్ నిజామీ పాల్గొని, సమాజంలో ఐక్యత, శాంతి, సౌహార్దం నెలకొల్పడంలో ఇలాంటి కార్యక్రమాల ప్రాముఖ్యతను వివరించారు. ఆయన రామగుండం కార్పొరేషన్ మండల ఇన్చార్జ్‌గా, జమాత్-ఎ-ఇస్లామీ హింద్ గోదావరిఖని యూనిట్ వైస్ ప్రెసిడెంట్‌గా సేవలందిస్తున్నారు.

కార్యక్రమాన్ని మొహమ్మద్ ముస్తఫా (వైస్ చైర్మన్, షరియత్ పంచాయతీ) సమర్థవంతంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి జమాత్-ఎ-ఇస్లామీ హింద్ గోదావరిఖని యూనిట్ ప్రెసిడెంట్ సయ్యద్ జావీద్ అక్మల్ హుస్సేనీ అధ్యక్షత వహించారు. ఆయన సింగరేణి సంస్థలో డిప్యూటీ జనరల్ మేనేజర్ (DGM, ENM, NIM, RG2, SCCL)గా పనిచేస్తున్నారు.

ఇఫ్తార్ విందుకు ప్రజాప్రతినిధులు, వైద్యులు, రిలీఫ్ అండ్ ఎడ్యుకేషన్ సంస్థ సభ్యులు, కార్మిక సంఘాల నాయకులు, వివిధ వర్గాల మత పెద్దలు పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793