-->

🐔 రేపటి నుంచి చికెన్ షాపుల బంద్‌పై కీలక ప్రకటన

🐔 రేపటి నుంచి చికెన్ షాపుల బంద్‌పై కీలక ప్రకటన


ఏప్రిల్ 1వ తేదీ నుంచి తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా చికెన్ షాపుల బంద్‌కు చికెన్ షాప్స్ ఓనర్స్ అసోసియేషన్ పిలుపునిచ్చింది. హైదరాబాద్ మహానగరంతో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఈ బంద్ అమలు కానుంది.

చికెన్ షాపుల యజమానులు తెలిపిన వివరాల ప్రకారం, పౌల్ట్రీ కంపెనీలు ఇచ్చే కమీషన్ మార్జిన్ తగ్గింపే ఈ నిర్ణయానికి ప్రధాన కారణం. గతంలో 1.8గా ఉన్న మార్జిన్‌ను ప్రస్తుతం 1.5కి తగ్గించడంతో తమకు తీవ్ర నష్టాలు వస్తున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ హైదరాబాద్‌లోని ధర్నా చౌక్ వద్ద భారీ నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్లు అసోసియేషన్ వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చికెన్ షాపుల యజమానులందరూ ఈ బంద్‌లో పాల్గొని విజయవంతం చేయాలని నాచారం అసోసియేషన్ ప్రతినిధులు పిలుపునిచ్చారు.

మార్జిన్ పెంపుపై పౌల్ట్రీ కంపెనీలు సానుకూలంగా స్పందించే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశారు. అలాగే అసోసియేషన్ నిర్ణయాన్ని పాటించకుండా షాపులు తెరిచే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ బంద్ కారణంగా వినియోగదారులకు చికెన్ సరఫరాలో అంతరాయం కలిగే అవకాశం ఉంది.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793