పరకాలలో ఆశా కార్యకర్తల ధర్నా.. హామీలు నెరవేర్చాలని డిమాండ్
హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలో తెలంగాణ గ్రామీణ ఆరోగ్య కార్యకర్తల (ఆశా) సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఆందోళన కార్యక్రమం చేపట్టారు. పట్టణంలోని బస్టాండ్ కూడలి వద్ద ఆశా కార్యకర్తలు భారీగా చేరుకుని ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి Revanth Reddy ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఆశా కార్యకర్తలు తమ సమస్యలను వివరించుతూ, పెండింగ్‌లో ఉన్న పారితోషకాలను తక్షణమే విడుదల చేయాలని కోరారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ప్రకారం నెలకు ₹18,000 వేతనం ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, ప్రమాద బీమా సౌకర్యం అందించాలని డిమాండ్ చేశారు.
అలాగే ప్రతి 1000 జనాభాకు ఒక ఆశా కార్యకర్తను నియమించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. గత మూడు నెలలుగా జీతాలు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ధర్నా కార్యక్రమంలో పరకాల మండలానికి చెందిన ఆశా సంఘం నాయకురాళ్లు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

Post a Comment