-->

సీనియర్ అసిస్టెంట్ శేఖర్‌కు ఈఓగా పదోన్నతి

సీనియర్ అసిస్టెంట్ శేఖర్‌కు ఈఓగా పదోన్నతి


నల్లగొండ జిల్లా కేంద్రంలోని తులసీనగర్ దేవాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న శేఖర్‌కు కార్యనిర్వాహణ అధికారి (ఈఓ)గా పదోన్నతి లభించింది.

మంగళవారం హైదరాబాద్‌లో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ చేతుల మీదుగా ఆయన పదోన్నతి ఉత్తర్వులు అందుకున్నారు.

ఈ సందర్భంగా ఉమ్మడి నల్లగొండ జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ భాస్కర్, తులసీనగర్ దేవాలయ అర్చకులు శివప్రసాద్ శర్మ, హరీష్ శర్మ, హనుమంతాచార్యులు తదితరులు శేఖర్‌ను అభినందించారు. అలాగే పలువురు బ్రాహ్మణులు, భక్తులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793