కల్తీ అల్లం-వెల్లుల్లి పేస్టు తయారీ ముఠా అరెస్ట్
హైదరాబాద్: నిత్యావసర వస్తువుల్లో కల్తీ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో మరో నకిలీ ముఠా బయటపడింది. లాలాగూడ ప్రాంతంలోని ఝాన్సీ అల్లం-వెల్లుల్లి పేస్ట్ గోదాంపై ఆహార భద్రత అధికారులు, పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు.
దాడుల్లో రసాయనాలను ఉపయోగించి కల్తీ అల్లం-వెల్లుల్లి పేస్టును తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ పేస్టును ‘ఝాన్సీ-M’ అనే నకిలీ బ్రాండ్ పేరుతో మార్కెట్‌లో విక్రయిస్తున్నట్లు వెల్లడైంది.
అధికారులు సుమారు 1,915 కిలోల కల్తీ పేస్టు, ఎసిటిక్ యాసిడ్, క్సాంతమ్ గమ్, ప్యాకింగ్ యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఘటనలో గోదాం యజమాని వెంకటేశ్వర్లు సహా పలువురు సిబ్బందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Post a Comment