-->

లయన్స్ క్లబ్ ఆఫ్ కొత్తగూడెం మిలీనియం 14నెంబర్ UPHC కి ఫ్రిడ్జ్‌ వితరణ

  

లయన్స్ క్లబ్ ఆఫ్ కొత్తగూడెం మిలీనియం 14నెంబర్ UPHC కి ఫ్రిడ్జ్‌ వితరణ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామవరం ప్రాంతంలో ఉన్న 14 నెంబర్ ప్రభుత్వ ఆసుపత్రికి లయన్స్ క్లబ్ ఆఫ్ కొత్తగూడెం మిలీనియం ఆధ్వర్యంలో ఫ్రిడ్జ్‌ను వితరణ చేశారు. ఈ సేవా కార్యక్రమం స్థానిక ప్రజలకు, ముఖ్యంగా రోగులకు ఎంతో ఉపయోగకరంగా నిలవనుంది.

ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రెసిడెంట్ లయన్ బొక్క శ్రీనివాస్, ట్రెజరర్ పగడాల నగేష్, ప్రోగ్రాం చైర్‌పర్సన్ లయన్ డి. బాబురావు, రీజన్ చైర్‌పర్సన్ లయన్ సాతులూరి సత్యనారాయణ, పాస్ట్ ప్రెసిడెంట్ లయన్ బి. సక్రు, డిస్ట్రిక్ట్ చైర్‌పర్సన్ లయన్ ఎం. రాజేశ్వర్ రావు, లయన్ టి. శరత్ బాబు పాల్గొన్నారు.

అలాగే ఆసుపత్రి డాక్టర్ రాము, హెడ్ నర్స్ శంకరమ్మ, కార్పొరేటర్ హిమశ్రీ, జమలయ్య తదితర సిబ్బంది కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా క్లబ్ సభ్యులు మాట్లాడుతూ, సామాజిక సేవలో భాగంగా ఇటువంటి కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు. ఆసుపత్రి సిబ్బంది లయన్స్ క్లబ్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793