జగిత్యాల జిల్లాలో ఏప్రిల్ 20న కేసీఆర్ భారీ బహిరంగ సభ
జగిత్యాల, ఏప్రిల్ 11: కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని బీఆర్‌ఎస్ పార్టీ జగిత్యాల జిల్లాలో ఈనెల 20న భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. ఈ సభకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరుకానుండగా, జిల్లాలో రాజకీయ చైతన్యం నెలకొంది.
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డి అదే రోజు కేసీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్ పార్టీలో చేరనున్నట్లు మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, ఎల్. రమణ వెల్లడించారు.
సాయంత్రం 5 గంటలకు జగిత్యాల పట్టణంలోని ఎస్.కె.ఎన్.ఆర్ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్‌లో ఈ సభ నిర్వహించనున్నారు. ఇప్పటికే నాయకులు సభ ఏర్పాట్లను వేగవంతం చేస్తున్నారు. వివిధ కాలేజీ ప్రాంగణాలను పరిశీలించి, భారీ జనసందోహం దృష్ట్యా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇటీవల ఎర్రవల్లిలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్‌తో జీవన్ రెడ్డి భేటీ కావడం ఈ రాజకీయ మార్పుకు బాటలు వేసినట్టు భావిస్తున్నారు.
బీఆర్‌ఎస్ నేతలు మాట్లాడుతూ—రైతు సమస్యలు, ప్రజా సమస్యలపై ఈ బహిరంగ సభలో చర్చించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడతామని స్పష్టం చేశారు.
జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ రావు, కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, ఎమ్మెల్సీ ఎల్. రమణ, బాపు రెడ్డి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

Post a Comment