-->

భార్యను చంపి… ఉరేసుకున్న భర్త – సదాశివపేటలో విషాదం

భార్యను చంపి… ఉరేసుకున్న భర్త – సదాశివపేటలో విషాదం


సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త, అనంతరం తానే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది.

సిద్ధాపూర్‌కు చెందిన రాజు (43), రాణి (40) దంపతులు కొంతకాలంగా కుటుంబ కలహాలతో జీవిస్తున్నారు. భార్యపై అనుమానం పెంచుకున్న రాజు, శుక్రవారం రాత్రి ఆమెతో తీవ్రంగా గొడవ పడ్డాడు. ఈ క్రమంలో ఆగ్రహంతో రోకలిబండతో రాణి తలపై మోదడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.

తన చర్యపై భయాందోళనకు గురైన రాజు, అనంతరం సమీపంలోని వ్యవసాయ భూమికి వెళ్లి చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

ఈ ఘటనతో కుటుంబం ఒక్కసారిగా ఛిద్రమైంది. తల్లిదండ్రులను కోల్పోయిన ఇద్దరు చిన్నారులు అనాథలుగా మారడం హృదయ విదారకంగా మారింది. గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793