ములకలపల్లిలో కోతుల సమస్యకు చెక్… బోన్ల ఏర్పాటు ప్రారంభం
ములకలపల్లి: ములకలపల్లి మేజర్ పంచాయతీలో ఏళ్ల తరబడి ప్రజలను వేధిస్తున్న కోతుల సమస్యకు చెక్ పెట్టేందుకు పంచాయతీ పాలకవర్గం చర్యలు ప్రారంభించింది. ఎన్నికల హామీల్లో భాగంగా కాంగ్రెస్ నాయకుడు బత్తుల అంజి సూచనల మేరకు ఏర్పాటు చేసిన కోతుల బోన్లను సర్పంచ్ కొర్సా చంద్రలేఖ శనివారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ కొర్సా చంద్రలేఖ మాట్లాడుతూ, గ్రామంలో పట్టుకున్న కోతులను ఎలాంటి హానీ కలగకుండా సురక్షితంగా అటవీ ప్రాంతంలో విడిచిపెడతామని తెలిపారు. ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు పంచాయతీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
మండల కేంద్రంలో ఉన్న ఇతర సమస్యలను కూడా ప్రాధాన్యతతో పరిష్కరించేందుకు చర్యలు కొనసాగుతాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పువ్వాల లలితరావు, వార్డు సభ్యులు ముదిగొండ శ్రీను, జంపాల రమణ, వీరునాయక్, ఊకే వెంకటమ్మ, కాంగ్రెస్ నాయకులు గాదె తిరుపతిరెడ్డి, రవి, గణపతి తదితరులు పాల్గొన్నారు.

Post a Comment