తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు
హైదరాబాద్: ఏప్రిల్ 26: తెలంగాణ రాష్ట్రంలో పరిపాలనా పునర్వ్యవస్థీకరణలో భాగంగా ప్రభుత్వం భారీ స్థాయిలో ఐఏఎస్ అధికారుల బదిలీలు చేపట్టింది. పలువురు ఉన్నతాధికారులను బదిలీ చేయడంతో పాటు మరికొందరికి కీలక బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీఎస్ రామకృష్ణా రావు శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ మార్పుల్లో సెక్రటరీలు, జిల్లా కలెక్టర్లు, జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్ల స్థాయి అధికారులకు కొత్త పోస్టింగులు ఇవ్వడం విశేషం.
ముఖ్య బదిలీలు – నియామకాలు
- సంజయ్ కుమార్: పీఆర్ & ఆర్డీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పదవి నుంచి బదిలీ అయి, న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్ ప్రత్యేక అధికారిగా నియామకం.
- ఎం. దాన కిశోర్: లెటీ ఎఫ్ శాఖ నుంచి బదిలీ అయి, పీఆర్ & ఆర్డీ, ఆర్‌డబ్ల్యూఎస్ & ఆర్‌ఎస్‌ఏడి విభాగాలకు స్పెషల్ చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు. అదనంగా గవర్నర్‌కు స్పెషల్ సీఎస్‌గా సేవలు.
- బి. విజయేంద్ర: సోషల్ డెవలప్‌మెంట్ శాఖ సెక్రటరీగా నియామకం.
- హరి చందన దసరి: హైదరాబాద్ కలెక్టర్ పదవి నుంచి బదిలీ అయి, లెటీ ఎఫ్ శాఖ సెక్రటరీగా నియామకం. రెవెన్యూ శాఖ అదనపు బాధ్యతలు కూడా అప్పగింపు.
- కృష్ణ ఆదిత్య ఎస్: ఇంటర్ బోర్డు సెక్రటరీ నుంచి పరిశ్రమలు & వాణిజ్య శాఖ స్పెషల్ సెక్రటరీగా నియామకం.
- జెండగే హనుమంత్ కొండిబా: సివిల్ సప్లైస్ డైరెక్టర్ నుంచి ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈఓగా నియామకం.
కొత్త జిల్లా కలెక్టర్లు
- హైదరాబాద్: ప్రియాంక అలా
- సంగారెడ్డి: ప్రాతీక్ జైన్
- (మాజీ కలెక్టర్ పి. ప్రవిణ్య ఆర్&బీ శాఖ స్పెషల్ సెక్రటరీగా బదిలీ)
- ఖమ్మం: దివాకర్ టీఎస్
- (మాజీ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఐటీఈ&సీ జాయింట్ సెక్రటరీగా బదిలీ)
- నిర్మల్: భవేష్ మిశ్రా
- (మాజీ కలెక్టర్ అభిలాష అభినవ్ ఇంటర్ బోర్డు సెక్రటరీగా బదిలీ)
- నారాయణపేట: చెక్క ప్రియాంక
- ములుగు: హేమంత్ సహదేవరావ్ భోర్కడే
- నాగర్‌కర్నూల్: కేశవ్ పాటిల్
ఈ భారీ స్థాయి బదిలీలతో రాష్ట్ర పరిపాలనలో మరింత చురుకుదనం తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. జిల్లాల అభివృద్ధి, పాలనలో వేగం పెంచేందుకు ఈ మార్పులు కీలకంగా మారనున్నాయి.

Post a Comment