-->

గురుకుల పాఠశాల విద్యార్థి అదృశ్యమైన ఘటన కలకలం

 

గురుకుల పాఠశాల విద్యార్థి అదృశ్యమైన ఘటన కలకలం

ఘట్కేసర్: మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలోని ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ గురుకుల పాఠశాల విద్యార్థి అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది.

పోలీసుల వివరాల ప్రకారం… జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఉట్లపల్లి గ్రామానికి చెందిన అవినాష్ (12) ఘట్కేసర్ మండలం ఏదులాబాద్‌లో ఉన్న తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్నాడు. బుధవారం సాయంత్రం 5:30 గంటల సమయంలో స్పోర్ట్స్ యాక్టివిటీ అనంతరం అతను కనిపించకుండా పోయాడు.

విద్యార్థికి పాఠశాలలో చదవడం ఇష్టం లేకపోవడంతో బదిలీ సర్టిఫికెట్ (TC) తీసుకోవాలని తల్లిదండ్రులను కోరినట్లు సమాచారం. అయితే వారు స్పందించకపోవడంతో స్వయంగా పాఠశాల వదిలి వెళ్లి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

విద్యార్థి అదృశ్యమైన సమయంలో ఆరెంజ్ రంగు టీ షర్ట్, బ్లూ జీన్స్ ధరించి ఉన్నట్లు గుర్తించారు. ఈ ఘటనపై పాఠశాల ప్రిన్సిపాల్ రాములు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

విద్యార్థి ఆచూకీ కోసం పోలీసులు విజ్ఞప్తి:

అవినాష్ గురించి ఎవరికైనా సమాచారం ఉంటే వెంటనే క్రింది ఫోన్ నంబర్లకు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరుతున్నారు:

📞 8712662183

📞 8712662705

పోలీసులు పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793