“హిందూ సమ్మేళనం” — పోస్టర్ ఆవిష్కరణ, కమిటీ ఏర్పాటు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం పట్టణంలో ఏప్రిల్ 26, 2026న ప్రకాశం స్టేడియంలో నిర్వహించనున్న “హిందూ సమ్మేళనం” కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం ఏప్రిల్ 11న బస్ స్టాండ్ సెంటర్ సమీపంలో ఘనంగా జరిగింది.
ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, హిందూ సమాజంలో ఐక్యతను పెంపొందించడం, ధర్మ పరిరక్షణతో పాటు సంప్రదాయ విలువలను కాపాడటం లక్ష్యంగా ఈ సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలను ఒకే వేదికపైకి తీసుకురావడం, ముఖ్యంగా యువతలో చైతన్యం పెంపొందించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా సమ్మేళన నిర్వహణకు కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ వివరాలు ఈ విధంగా ఉన్నాయి:
- అధ్యక్షులు: పి. వీరవర్ధనరావు
- కార్యదర్శి: లట్టి జగన్ మోహన్
- ఉపాధ్యక్షులు: పల్లపోతు వాసు, కంభంపాటి రమేష్, భూపతి అప్పారావు, గోపాల్ పంచారియా
- సహకార్యదర్శులు: మనీష్ అగర్వాల్, రమాదేవి, బండి భాస్కర్, వారాహి సురేష్
- గౌరవ సలహాదారులు: దారా రమేష్, కొదుమూరి శ్రీనివాస్, కృష్ణమూర్తి గురుస్వామి, పలివెల సాంబశివరావు
- ప్రచార కార్యదర్శులు: యెలదండి పూర్ణచందర్ రావు, నంది శశికుమార్
- కోశాధికారి: పొన్నం ఉమామహేశ్వరరావు
- కార్యవర్గ సభ్యులు: కొండవీటి దత్తాత్రేయశర్మ, మెరుగు చింటేశ్వర్, వందనపు శ్రీధర్, సొప్పరి క్రాంతి, జె. తారక్, అప్పారి లక్ష్మణ్, డి.వి.పి యాదవ్, మహేష్ జాజు, రామకృష్ణ, రాజశేఖర్, ప్రదీప్, సిహెచ్ తిరుపాల్
పోస్టర్‌లో పేర్కొన్న విధంగా, ఈ సమ్మేళనం ద్వారా హిందూ సమాజానికి సంబంధించిన పలు అంశాలపై చర్చలు, చైతన్య కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రముఖులు, మహిళలు, యువత, హిందూ బంధువులు మరియు సామాజిక కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కమిటీ సభ్యులు పిలుపునిచ్చారు.

Post a Comment