గోదావరిఖనిలో ఘోర రోడ్డు ప్రమాదం: ఒకరు మృతి
పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికంగా రాజేష్ థియేటర్ సమీపంలో అతి వేగంగా దూసుకువచ్చిన కారు అదుపుతప్పి కరెంట్ స్తంభాన్ని ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో సింగరేణి ఉద్యోగి శ్రీధర్ అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద తీవ్రతకు కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జు అయి, వాహనంలో ఉన్న నలుగురు వ్యక్తులు లోపలే ఇరుక్కుపోయారు.
స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ప్రమాదానికి అతివేగమే కారణమని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. 🚨

Post a Comment