పాల్వంచలో లేడీస్ జిమ్ & జుంబా స్టూడియో ప్రారంబించిన నాగ సీతారాములు
పాల్వంచ, ఏప్రిల్ 22: పాల్వంచ పట్టణంలో మహిళల ఆరోగ్యం, ఫిట్‌నెస్‌ను ప్రోత్సహించే దిశగా లేడీస్ జిమ్ & జుంబా స్టూడియోను ఘనంగా ప్రారంభించారు. పట్టణ పరిధిలోని 40వ డివిజన్‌లో ఏర్పాటు చేసిన ఈ స్టూడియోను ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుతో కలిసి టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి మేయర్ మూడ్ గణేష్, డిప్యూటీ మేయర్ సిరిపురపు లలిత ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలో అత్యాధునిక సదుపాయాలతో మహిళలకు ప్రత్యేకంగా జిమ్ ఏర్పాటు చేయడం పట్ల వారు హర్షం వ్యక్తం చేస్తూ నిర్వాహకులను అభినందించారు. మహిళలు ఆరోగ్యంపై దృష్టి పెట్టేందుకు ఇలాంటి సదుపాయాలు మరింతగా ఉపయోగపడతాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు యుగంధర్ రెడ్డి, ఉపాధ్యక్షుడు వై వెంకటేశ్వర్లు, జిమ్ ట్రైనర్ సింధు, 6వ డివిజన్ కార్పొరేటర్ బిఎస్ రావు, 5వ డివిజన్ కార్పొరేటర్ నూకల సరిత, 2వ డివిజన్ కార్పొరేటర్ భవిత కిరణ్, 40వ డివిజన్ కార్పొరేటర్ సాయిబాబా, 41వ డివిజన్ కార్పొరేటర్ అన్నపూర్ణ, 45వ డివిజన్ కార్పొరేటర్ దంతేబోయిన నరేష్ తదితరులు పాల్గొన్నారు.
అలాగే మాజీ పెద్దమ్మ తల్లి గుడి చైర్మన్ మహిపతి రామలింగం, యువజన కాంగ్రెస్ నాయకులు భరత్‌తో పాటు పురప్రముఖులు, యువత, మహిళలు పెద్దఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Post a Comment