-->

సమాచార హక్కు చట్టం అమలులో లోపాలు – కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్

సమాచార హక్కు చట్టం అమలులో లోపాలు – కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్


మేడ్చల్ మల్కాజ్గిరి నాచారం ఉప్పల్ అందె రఘు… 2012 సంవత్సరం నుండి సమాచార హక్కు చట్టం (RTI) కార్యకర్తగా పని చేస్తున్నాను. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో వేలాది దరఖాస్తులు సమర్పించాను.

అయితే, ప్రస్తుతం పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది. చాలా మంది అధికారులు చట్టానికి గౌరవం ఇవ్వడం లేదు… భయం కూడా కనిపించడం లేదు. కేవలం 12 నుండి 15 పేజీల సమాచారం ఇవ్వడానికి కూడా జిరాక్స్ ఖర్చుల పేరుతో 25 వేల రూపాయలు చెల్లించాలంటూ సమాధానాలు ఇస్తున్నారు.

చాలా కేసులు సమాచార కమిషన్‌ల వరకు వెళ్లినప్పటికీ, సమాచారం ఇవ్వని అధికారులపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవడం లేదు. శిక్షలు విధించినా అవి అమలులోకి రావడం లేదు. జరిమానాలు వేసినా అవి వసూలు చేయడం లేదు.

ప్రజలకు అత్యంత ఉపయోగకరంగా, శక్తివంతంగా ఉండాల్సిన ఈ చట్టం… ప్రస్తుతం విఫలమైన చట్టంగా మారిందని ప్రజలు భావిస్తున్నారు.

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1) ప్రకారం సమాచార హక్కు ప్రాథమిక హక్కులో భాగం. అందువల్ల సమాచారం ఇవ్వని అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, శిక్షలను ఖచ్చితంగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. అప్పుడే ఈ చట్టం సరైన మార్గంలో అమలవుతుందని నా అభిప్రాయం.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793