ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం పత్రికా స్వేచ్ఛ… సమాజం ఊపిరి మంజుల
హైదరాబాద్: సమాజంలో సత్యాన్ని వెలికితీసి ప్రజలకు చేరవేసే శక్తిగా పత్రికా రంగం నిలుస్తోంది. ప్రతి పత్రికా కలం ఒక దీపంలా చీకట్లను చెదరగొడుతూ ప్రజలకు మార్గదర్శకంగా నిలుస్తోంది. కాగితంపై అక్షరాలుగా మారే ప్రతి పదం సమాజానికి వెలుగు నింపుతూ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తోంది.
ఒక వార్త వెనుక విలేకరుల నిరంతర కృషి దాగి ఉంటుంది. రాత్రి పగలు తేడా లేకుండా, ఎండ వానలను లెక్కచేయకుండా, అనేక ఆటుపోటులను ఎదుర్కొంటూ వారు నిజం కోసం అడుగులు వేస్తుంటారు. బెదిరింపులను సైతం పట్టించుకోకుండా ప్రజల కోసం, దేశం కోసం వారు చేసే సేవ అపారమని చెప్పాలి.
నిజాన్ని వెలుగులోకి తీసుకువచ్చే ప్రతి అక్షరం శక్తివంతమైన ఆయుధంలా మారి, అధికార వ్యవస్థలను కదిలించే సామర్థ్యం కలిగి ఉంటుంది. ప్రజలు స్వేచ్ఛగా శ్వాసించేందుకు, పారదర్శకత నెలకొనేందుకు పత్రికా రంగం కీలక పాత్ర పోషిస్తోంది. ఎలాంటి అణచివేతలు ఎదురైనా ప్రజాస్వామ్యానికి పత్రికలు కంచుకోటగా నిలుస్తున్నాయి.
ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం (మే 3) సందర్భంగా పత్రికా రంగానికి చెందిన వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారి సేవలను స్మరించుకోవాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Post a Comment