ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం.. 20 ఫైరింజన్లతో మంటల అదుపు ప్రయత్నాలు
ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం.. 20 ఫైరింజన్లతో మంటల అదుపు ప్రయత్నాలు
దేశ రాజధాని New Delhiలో మరో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మంగళవారం అర్ధరాత్రి తర్వాత ఉద్యోగ్ భవన్ సమీపంలోని స్లమ్ ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
మంటలు వేగంగా వ్యాపించడంతో సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఘటనాస్థలికి 20 ఫైరింజన్లను తరలించి మంటలను అదుపులోకి తీసుకురావడానికి సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. అగ్నిప్రమాదం కారణంగా పరిసర ప్రాంతమంతా దట్టమైన పొగతో కమ్ముకుపోయింది.
ప్రాథమిక సమాచారం ప్రకారం, షార్ట్ సర్క్యూట్ కారణంగా ఎలక్ట్రిక్ ప్యానల్‌లో మంటలు చెలరేగి, అక్కడి నుంచి సమీపంలోని గుడిసెలకు వ్యాపించినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. అయితే ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణం ఇంకా నిర్ధారణ కాలేదు.
ఘటనపై అగ్నిమాపక శాఖ, పోలీసులు సంయుక్తంగా దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. ఈ ఘటనలో ప్రాణనష్టం లేదా గాయాలపై ఇప్పటివరకు అధికారిక సమాచారం వెలువడలేదు.

Post a Comment