-->

ఆర్డీవో కార్యాలయంలో ఏసీబీ దాడులు.. లంచం తీసుకుంటూ డిప్యూటీ తహసీల్దార్ అరెస్ట్

ఆర్డీవో కార్యాలయంలో ఏసీబీ దాడులు.. లంచం తీసుకుంటూ డిప్యూటీ తహసీల్దార్ అరెస్ట్

ఆర్డీవో కార్యాలయంలో ఏసీబీ దాడులు.. లంచం తీసుకుంటూ డిప్యూటీ తహసీల్దార్ అరెస్ట్

మార్కాపురం జిల్లా కనిగిరి ఆర్డీవో కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు నిర్వహించిన ఆకస్మిక దాడుల్లో ఓ డిప్యూటీ తహసీల్దార్ లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. భూ విభజన (సబ్‌డివిజన్) ఫైలు పరిష్కారం కోసం లంచం డిమాండ్ చేసిన అధికారిని ఏసీబీ అధికారులు వలపన్ని అరెస్ట్ చేశారు.

వివరాల ప్రకారం, కనిగిరి ఆర్డీవో కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న డిప్యూటీ తహసీల్దార్ చుండి పృథ్వీరాజ్ భూ విభజనకు సంబంధించిన ఫైలును పరిష్కరించేందుకు ఫిర్యాదుదారు వేపుల వెంకటేశ్వర్లు నుంచి రూ.25 వేల లంచం కోరినట్లు తెలుస్తోంది. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు.

ఫిర్యాదు ఆధారంగా ఒంగోలు ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో కనిగిరి ఆర్డీవో కార్యాలయంలో ఉచ్చుపన్ని నిందితుడిని పట్టుకునేందుకు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో బాధితుడి నుంచి లంచం స్వీకరిస్తున్న సమయంలోనే డిప్యూటీ తహసీల్దార్‌ను అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా అదుపులోకి తీసుకున్నారు.

అరెస్ట్ అనంతరం నిందితుడి వద్ద నుంచి లంచం మొత్తాన్ని స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు, సంబంధిత పత్రాలను పరిశీలిస్తూ కేసుపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అనంతరం నిందితుడిని నెల్లూరులోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నట్లు అధికారులు వెల్లడించారు.

ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపగా, ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి నిర్మూలన కోసం ఏసీబీ అధికారులు మరింత కఠిన చర్యలు తీసుకుంటున్నారని అధికారులు పేర్కొన్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793