మొహర్రం ఏర్పాట్లపై ప్రభుత్వ నిర్లక్ష్యం.. ఇంకా ప్రారంభం కాని సన్నాహాలు కల్వకుంట్ల కవిత!
హైదరాబాద్, జూన్ 4: పవిత్ర మొహర్రం మాసం ప్రారంభానికి కేవలం 12 రోజులు మాత్రమే మిగిలి ఉండగా, తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి స్పష్టమైన ఏర్పాట్లు చేపట్టకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ప్రతి ఏడాది రాష్ట్రవ్యాప్తంగా భారీ ఎత్తున నిర్వహించే మొహర్రం కార్యక్రమాలకు సంబంధించిన సన్నాహాలు ఇంకా ప్రారంభం కాకపోవడంపై మత పెద్దలు, నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యంగా మొహర్రం ఏర్పాట్లపై ప్రభుత్వం ఇప్పటివరకు సమీక్ష సమావేశాలు నిర్వహించకపోవడం విమర్శలకు తావిస్తోంది. చారిత్రాత్మకంగా అత్యంత ప్రాధాన్యత కలిగిన బీబీ కా ఆలమ్ ఊరేగింపుకు అవసరమైన ఏనుగు ఏర్పాటు వంటి కీలక అంశాలు కూడా ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయని సమాచారం.
అలాగే తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 11,836 అషూర్‌ఖానాలకు అందించాల్సిన ప్రభుత్వ సహాయం, నిధుల మంజూరు ప్రక్రియ కూడా ఇంకా పూర్తికాలేదని తెలుస్తోంది. దీంతో మొహర్రం నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు ఆలస్యమవుతున్నాయని నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మొహర్రం సందర్భంగా లక్షలాది మంది భక్తులు వివిధ కార్యక్రమాల్లో పాల్గొనే నేపథ్యంలో, ప్రభుత్వం తక్షణమే స్పందించి అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేయాలని మతపెద్దలు, ప్రజాప్రతినిధులు కోరుతున్నారు. కార్యక్రమాలు ప్రశాంతంగా, గౌరవప్రదంగా, సాంప్రదాయబద్ధంగా జరిగేలా సంబంధిత శాఖలు వెంటనే చర్యలు చేపట్టాలని TRS చీఫ్డి కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు.

Post a Comment