భూమి వివాదం.. తమ్ముడిని గొడ్డలితో నరికి చంపిన అన్న
భూమి వివాదం.. తమ్ముడిని గొడ్డలితో నరికి చంపిన అన్న
మంచిర్యాల జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. బెల్లంపల్లి మండలం చంద్రవెల్లి గ్రామంలో భూమి వివాదం కారణంగా అన్న తన తమ్ముడిని గొడ్డలితో నరికి హత్య చేసిన సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. చంద్రవెల్లి గ్రామానికి చెందిన రాజేశ్ (32)కు తన అన్న చందుతో భూమి విషయంలో కొంతకాలంగా వివాదం కొనసాగుతోంది. ఈ క్రమంలో శనివారం ఇద్దరి మధ్య మరోసారి వాగ్వాదం జరగగా, అది తీవ్ర ఘర్షణకు దారితీసింది. ఆగ్రహానికి గురైన చందు గొడ్డలితో రాజేశ్‌పై దాడి చేయగా, తీవ్ర గాయాలపాలైన రాజేశ్ అక్కడికక్కడే మృతి చెందాడు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి హత్యకు గల పూర్తి కారణాలపై దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనతో చంద్రవెల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Post a Comment