కుటుంబ కలహాలు విషాదానికి దారి.. కన్నతల్లిని హత్య చేసి కొడుకు ఆత్మహత్య
కుటుంబ కలహాలు విషాదానికి దారి.. కన్నతల్లిని హత్య చేసి కొడుకు ఆత్మహత్య
యాదాద్రి భువనగిరి జిల్లాలోని భూదాన్ పోచంపల్లి మండలం పెద్దరావులపల్లి గ్రామంలో సోమవారం విషాద ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి తన కన్నతల్లిని హత్య చేసి, అనంతరం తాను ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం, శ్రీనివాస్ అనే వ్యక్తి కుటుంబ విభేదాల కారణంగా తన తల్లి పోశమ్మపై బండరాయితో దాడి చేసి హత్య చేసినట్లు తెలుస్తోంది. అనంతరం అదే గ్రామంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఈ ఘటనలో మృతులను పోశమ్మ, శ్రీనివాస్‌లుగా పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ విషాద సంఘటనతో పెద్దరావులపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Post a Comment