-->

షాద్‌నగర్‌లో కలకలం.. హోటళ్లకు కుళ్లిన చికెన్ తరలింపు, ఆటో సీజ్

 

షాద్‌నగర్‌లో కలకలం.. హోటళ్లకు కుళ్లిన చికెన్ తరలింపు, ఆటో సీజ్

షాద్‌నగర్‌లో కలకలం.. హోటళ్లకు కుళ్లిన చికెన్ తరలింపు, ఆటో సీజ్

రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పట్టణంలో కుళ్లిన కోళ్ల మాంసం తరలింపు ఘటన కలకలం రేపింది. మహబూబ్‌నగర్ నుంచి ఆటోలో అనుమానాస్పద చికెన్‌ను షాద్‌నగర్‌కు తీసుకువస్తుండగా స్థానిక వ్యాపారులు అడ్డుకుని మున్సిపల్ అధికారులకు సమాచారం అందించారు.

అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని ఆటోలో ఉన్న చికెన్‌ను పరిశీలించగా, అనారోగ్యంతో చనిపోయిన కోళ్లు, పాడైపోయిన (డ్యామేజ్ అయిన) మాంసాన్ని తరలిస్తున్నట్లు గుర్తించారు. తక్కువ ధరకు లభిస్తుందనే ఆశతో షాద్‌నగర్‌లోని కొన్ని హోటల్ నిర్వాహకులు ఇలాంటి నాసిరకం మాంసాన్ని కొనుగోలు చేసి ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

ఈ ఘటనపై మున్సిపల్ కమిషనర్ సునీత స్పందిస్తూ, కుళ్లిన చికెన్‌ను తరలిస్తున్న ఆటోను సీజ్ చేసినట్లు తెలిపారు. అలాగే ఇలాంటి మాంసాన్ని కొనుగోలు చేస్తున్న హోటళ్లను గుర్తించి, వాటిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఈ ఘటనతో షాద్‌నగర్ ప్రజల్లో ఆందోళన నెలకొంది. హోటళ్లలో ఆహారం తీసుకునే విషయంలో వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అలాగే ఆహార భద్రతా నిబంధనలు ఉల్లంఘించే వారిపై నిరంతర తనిఖీలు కొనసాగిస్తామని మున్సిపల్ అధికారులు వెల్లడించారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793