జనగామలో వరుస గేదెల దొంగతనాల కేసు ఛేదన.. నలుగురు అరెస్ట్, వాహనం సీజ్
జనగామలో వరుస గేదెల దొంగతనాల కేసు ఛేదన.. నలుగురు అరెస్ట్, వాహనం సీజ్
జనగామ: జనగామ జిల్లాలో వరుసగా గేదెలు, దూడలను దొంగతనం చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేసి కేసును ఛేదించారు. ఈ కేసులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
నిందితుల నుంచి 5 గేదెలు, 2 దూడలు, ఒక అశోక్ లేలాండ్ గూడ్స్ వాహనం, 2 మొబైల్ ఫోన్లు, అలాగే దొంగిలించిన గేదెల విక్రయం ద్వారా వచ్చిన రూ.50 వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసును విజయవంతంగా ఛేదించిన సీఐ సత్యనారాయణ రెడ్డి, ఎస్ఐ భరత్తో పాటు దర్యాప్తులో పాల్గొన్న పోలీసు సిబ్బందిని జనగామ సీపీ సన్ ప్రీత్ సింగ్ అభినందించారు. జిల్లాలో పశువుల దొంగతనాలపై కఠిన చర్యలు కొనసాగుతాయని పోలీసులు తెలిపారు.

Post a Comment