కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: ఒకరు మృతి, ఐదుగురికి గాయాలు
కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: ఒకరు మృతి, ఐదుగురికి గాయాలు
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రామకృష్ణ కాలనీ శివారులోని రాజీవ్ రహదారిపై వెళ్తున్న ఆటోను వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.
ఈ ఘటనలో తిమ్మాపూర్ మండలం పర్లపల్లికి చెందిన ఎల్లయ్య అక్కడికక్కడే మృతిచెందగా, మరో ఐదుగురు గాయపడ్డారు. గాయపడిన వారిలో వీణవంకకు చెందిన తూర్పట్టి రమేశ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
కారు కరీంనగర్ వైపు వెళ్తున్న ఆటోను వెనుక నుంచి ఢీకొట్టినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Post a Comment