కదులుతున్న బస్సు నుంచి కిందపడిన బాలిక.. తీవ్ర గాయాలు
కదులుతున్న బస్సు నుంచి కిందపడిన బాలిక.. తీవ్ర గాయాలు
వికారాబాద్: కదులుతున్న ఆర్టీసీ బస్సులో అత్యవసర ద్వారం (ఎమర్జెన్సీ డోర్) అకస్మాత్తుగా తెరుచుకోవడంతో ఓ బాలిక బస్సు నుంచి కిందపడిన ఘటన వికారాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, పరిగి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కర్ణాటక రాష్ట్రం నుంచి హైదరాబాద్‌కు ప్రయాణిస్తోంది. ఈ క్రమంలో పూడూరు మండలం రాకంచర్ల గ్రామ శివారులో బస్సు కుడివైపున ఉన్న అత్యవసర ద్వారం అకస్మాత్తుగా తెరుచుకుంది.
ద్వారం సమీపంలోని కిటికీ పక్కన కూర్చున్న బాలిక బస్సు నుంచి కిందపడిపోవడంతో తీవ్ర గాయాలపాలైంది. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ బస్సును ఆపి, బాలికను సమీప ఆస్పత్రికి తరలించారు.
అత్యవసర ద్వారం తెరుచుకోవడం వల్లే బాలిక కిందపడినట్లు ప్రాథమికంగా భావిస్తున్నామని ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్ తెలిపారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టగా, బాలిక ఆరోగ్య పరిస్థితిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Post a Comment