-->

బాల కార్మిక నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలి: డీఎల్ఎస్ఏ కార్యదర్శి రాజేందర్

బాల కార్మిక నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలి: డీఎల్ఎస్ఏ కార్యదర్శి రాజేందర్

బాల కార్మిక నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలి: డీఎల్ఎస్ఏ కార్యదర్శి రాజేందర్

మణుగూరు, జూన్ 12: బాల కార్మిక వ్యవస్థ సమాజ అభివృద్ధికి అడ్డంకిగా మారుతుందని, బాల కార్మిక నిర్మూలనకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ (డీఎల్ఎస్ఏ) కార్యదర్శి ఎం. రాజేందర్ పిలుపునిచ్చారు.

ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో మణుగూరు మండలంలోని సీతారాంపురం గ్రామంలోని ఇటుక బట్టీల యజమానులతో అవగాహన సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా రాజేందర్ మాట్లాడుతూ ప్రతి చిన్నారికి విద్య, ఆరోగ్యం, రక్షణతో పాటు గౌరవప్రదమైన బాల్యం పొందే హక్కు ఉందన్నారు. చిన్నారులను పనిలో నియమించడం చట్టవిరుద్ధమని, బాల కార్మిక (నిషేధం మరియు నియంత్రణ) చట్టం ప్రకారం బాల కార్మికులను పనిలో పెట్టుకునే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

అనంతరం సీతారాంపురం గ్రామంలోని ఇటుక బట్టీలను ప్రత్యక్షంగా పరిశీలించిన ఆయన, అక్కడి కార్మికుల పరిస్థితులు, వారి పిల్లల విద్యా స్థితిగతులు, బాల కార్మికులు ఉన్నారా లేదా అనే అంశాలపై వివరాలు సేకరించారు. ఇటుక బట్టీల యజమానులు ఎట్టి పరిస్థితుల్లోనూ బాల కార్మికులను నియమించకూడదని, కార్మికుల పిల్లలు తప్పనిసరిగా పాఠశాలలకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

బాలల హక్కుల పరిరక్షణలో యజమానులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు సమాజంలోని ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన కోరారు.

ఈ కార్యక్రమంలో కొత్తగూడెం లేబర్ ఆఫీసర్ నాగరాజు, ఇటుక బట్టీల యూనియన్ అధ్యక్షుడు మల్లారెడ్డి, కార్యదర్శి కొండలరావు, ఇటుక బట్టీల యజమానులు తదితరులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793