నల్లగొండలో దారుణ హత్య.. బండరాళ్లతో మోది యువకుడి హత్య
నల్లగొండలో దారుణ హత్య.. బండరాళ్లతో మోది యువకుడి హత్య
నల్లగొండ పట్టణంలో మంగళవారం ఉదయం మరో దారుణ హత్య కలకలం రేపింది. పెద్దబండ ప్రాంతంలోని సత్యనారాయణ కాలనీకి చెందిన బోతు సాయి అనే యువకుడిని గుర్తు తెలియని దుండగులు అత్యంత క్రూరంగా హత్య చేశారు.
తిప్పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో, నల్లగొండకు సమీపంలోని హ్యాపీ హోమ్స్ ఎదురుగా ఉన్న ఓ వెంచర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. దుండగులు సాయిపై బండరాళ్లతో దాడి చేసి, తలకు తీవ్ర గాయాలు కలిగించేలా దారుణంగా హతమార్చినట్లు ప్రాథమిక సమాచారం వెల్లడైంది.
సమాచారం అందుకున్న వెంటనే టూ టౌన్ సీఐ రాఘవరావు, తిప్పర్తి ఎస్‌ఐ శంకర్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ సిబ్బంది కూడా రంగంలోకి దిగి ఆధారాలు సేకరిస్తున్నారు. హత్య వెనుక ఉన్న కారణాలు, నిందితుల వివరాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఘటన విషయం తెలిసిన వెంటనే మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని ఆందోళన వ్యక్తం చేశారు. నిందితులను త్వరలోనే గుర్తించి అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు.
ఈ హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు.

Post a Comment