-->

కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు శుభవార్త.. ప్రతి నెల 1వ తేదీకే జీతాలు!

 

కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు శుభవార్త.. ప్రతి నెల 1వ తేదీకే జీతాలు!

కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు శుభవార్త.. ప్రతి నెల 1వ తేదీకే జీతాలు!

హైదరాబాద్, జులై 2: తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లు, సొసైటీలు, యూనివర్సిటీలు, ప్రభుత్వ అనుబంధ సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ఇకపై ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే ప్రతి నెల మొదటి తేదీన వారి బ్యాంకు ఖాతాల్లో జీతాలు జమయ్యేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

గతంలో జీతాలు తరచూ ఆలస్యంగా రావడంతో వేలాది మంది కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యపై ఇటీవల నిర్వహించిన సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి, ఉద్యోగులకు నిర్ణీత తేదీన జీతాలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

సీఎం ఆదేశాల మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ అన్ని ప్రభుత్వ శాఖలకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. కొత్త విధానం ప్రకారం ప్రతి నెల 25వ తేదీలోగా సంబంధిత శాఖలు జీతాల బిల్లులను ట్రెజరీ, పే అండ్ అకౌంట్స్ విభాగాలకు సమర్పించాలి. అనంతరం నెలాఖరు పని దినానికల్లా బిల్లుల పరిశీలన, ఆడిట్ ప్రక్రియ పూర్తి చేసి, తదుపరి నెల 1వ తేదీన ఉద్యోగుల ఖాతాల్లో జీతాలు జమయ్యేలా చర్యలు చేపట్టాలని సూచించింది.

ఈ నిబంధనల అమలులో భాగంగా జూలై నెలకు సంబంధించిన బిల్లులు సకాలంలో సమర్పించిన అన్ని శాఖల కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లో జూలై 1వ తేదీననే జీతాలు జమ చేసినట్లు రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నివేదిక సమర్పించింది.

ప్రభుత్వ నిర్ణయంపై రాష్ట్రవ్యాప్తంగా కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి నెల జీతాల కోసం రోజుల తరబడి ఎదురుచూడాల్సిన అవసరం లేకుండా, కుటుంబ ఆర్థిక ప్రణాళికలు సక్రమంగా రూపొందించుకునేందుకు ఈ నిర్ణయం ఎంతో ఉపయోగపడుతుందని వారు అభిప్రాయపడుతున్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793