-->

భద్రాద్రి అంగన్‌వాడీ టీచర్ పోస్టులకు నోటిఫికేషన్.. జులై 18 వరకు దరఖాస్తులు

 

భద్రాద్రి అంగన్‌వాడీ టీచర్ పోస్టులకు నోటిఫికేషన్.. జులై 18 వరకు దరఖాస్తులు

భద్రాద్రి అంగన్‌వాడీ టీచర్ పోస్టులకు నోటిఫికేషన్.. జులై 18 వరకు దరఖాస్తులు

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీ పోస్టుల భర్తీ ప్రక్రియను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా మహిళా, శిశు, దివ్యాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని వివిధ ఐసీడీఎస్ (ICDS) ప్రాజెక్టుల్లో ఖాళీగా ఉన్న 178 అంగన్‌వాడీ టీచర్ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన మహిళా అభ్యర్థులు 2026 జులై 18 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 15,982 అంగన్‌వాడీ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే పలు జిల్లాల్లో నియామక ప్రక్రియ ప్రారంభం కాగా, తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడింది. మిగిలిన జిల్లాల్లోనూ త్వరలో విడతల వారీగా ప్రకటనలు విడుదలయ్యే అవకాశం ఉంది.

ప్రాజెక్టుల వారీగా ఖాళీలు

  • మణుగూరు – 24
  • పాల్వంచ – 29
  • ఇల్లెందు – 21
  • టేకులపల్లి – 19
  • దమ్మపేట – 16
  • కొత్తగూడెం – 16
  • చర్ల – 12
  • దుమ్ముగూడెం – 12
  • అశ్వారావుపేట – 11
  • బూర్గంపాడు – 10
  • చంద్రుగొండ – 8

అర్హతలు

అంగన్‌వాడీ టీచర్, హెల్పర్ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులు అయి ఉండాలి. ఇంటర్ అర్హత కలిగిన వారు అందుబాటులో లేని పరిస్థితిలో 10వ తరగతి ఉత్తీర్ణులను పరిగణనలోకి తీసుకుంటారు. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.

వినికిడి పరికరాల సహాయంతో వినగలిగే వారు, ఇతరుల సహాయం లేకుండా సంచరించగల అంధ మహిళలు, పిల్లల సంరక్షణ చేయగల సామర్థ్యం ఉన్న దివ్యాంగ మహిళలు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

ఎంపిక విధానం

దరఖాస్తుదారులు తప్పనిసరిగా స్థానిక మహిళలే అయి ఉండాలి. పట్టణ ప్రాంతాల్లో సంబంధిత వార్డులో, గ్రామీణ ప్రాంతాల్లో అంగన్‌వాడీ కేంద్రం ఉన్న గ్రామపంచాయతీ పరిధిలో నివసించాలి.

గిరిజన తండాలు, గూడేల్లోని పోస్టులకు స్థానిక ఎస్టీ మహిళలు, ఎస్సీ వాడల్లోని పోస్టులకు స్థానిక ఎస్సీ మహిళలు మాత్రమే అర్హులు.

జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని జిల్లా ఎంపిక కమిటీ ఇంటర్వ్యూల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తుంది. వెయిటేజ్ ఇలా ఉంటుంది:

  • ఇంటర్మీడియట్ మార్కులు – 70 మార్కులు
  • అనాథలకు – 10 మార్కులు
  • వితంతువులకు – 5 మార్కులు
  • దివ్యాంగులకు – 5 మార్కులు
  • ఇంటర్వ్యూ – 10 మార్కులు

ముఖ్యమైన తేదీలు

  • దరఖాస్తుల చివరి తేదీ: 18 జులై 2026
  • సర్టిఫికెట్ల పరిశీలన: 20 జులై నుంచి 7 ఆగస్టు 2026 వరకు

అప్లికేషన్‌కు అవసరమైన పత్రాలు

దరఖాస్తు సమయంలో ఈ పత్రాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలి:

  • పుట్టిన తేదీ ధృవీకరణ పత్రం
  • కుల ధృవీకరణ పత్రం
  • ఇంటర్ లేదా అంతకంటే ఎక్కువ విద్యార్హతల మార్కుల మెమోలు
  • స్థానిక నివాస ధృవీకరణ పత్రం
  • సదరం సర్టిఫికేట్ (వర్తిస్తే)
  • వితంతు లేదా అనాథ ధృవీకరణ పత్రం (వర్తిస్తే)

అర్హత కలిగిన మహిళా అభ్యర్థులు చివరి తేదీకి ముందే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793