-->

3వ జోనల్ పోలీస్ డ్యూటీ మీట్–2026లో మెదక్ జిల్లా పోలీసులకు 8 పతకాలు

 

3వ జోనల్ పోలీస్ డ్యూటీ మీట్–2026లో మెదక్ జిల్లా పోలీసులకు 8 పతకాలు

3వ జోనల్ పోలీస్ డ్యూటీ మీట్–2026లో మెదక్ జిల్లా పోలీసులకు 8 పతకాలు

మెదక్: 3వ జోనల్ పోలీస్ డ్యూటీ మీట్–2026లో మెదక్ జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది విశేష ప్రతిభ కనబరిచి మొత్తం 8 పతకాలను కైవసం చేసుకున్నారు. వివిధ విభాగాల్లో నిర్వహించిన పోటీల్లో అత్యుత్తమ నైపుణ్యాన్ని ప్రదర్శించి జిల్లా పోలీసు శాఖకు గుర్తింపు తీసుకువచ్చారు.

ఈ సందర్భంగా విజేతలను మెదక్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) శ్రీ డి.వి. శ్రీనివాసరావు, ఐపీఎస్ అభినందించి సత్కరించారు. కఠినమైన శిక్షణ, అంకితభావం, విధి నిర్వహణలో నైపుణ్యం వల్లే ఈ విజయం సాధ్యమైందని ఆయన పేర్కొన్నారు.

జిల్లా పోలీసు సిబ్బంది సాధించిన ఈ విజయాలు మొత్తం పోలీసు శాఖకు గర్వకారణమని ఎస్పీ అన్నారు. ఇదే ఉత్సాహం, పట్టుదలతో త్వరలో జరగనున్న రాష్ట్ర స్థాయి పోలీస్ డ్యూటీ మీట్ పోటీల్లోనూ అత్యుత్తమ ప్రతిభ కనబరిచి మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షించారు.

విజేతలకు అధికారులు, సహచర పోలీసు సిబ్బంది అభినందనలు తెలియజేస్తూ, రాష్ట్ర స్థాయిలో మెదక్ జిల్లా పోలీసుల సత్తా చాటాలని శుభాకాంక్షలు తెలిపారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793