ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు లారీలు ఢీకొని నలుగురు సజీవ దహనం
పల్నాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు లారీలు ఢీకొని నలుగురు సజీవ దహనం
పల్నాడు జిల్లాలోని యడ్లపాడు మండలం బోయపాలెం సమీపంలో జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వచ్చిన రెండు లారీలు బలంగా ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి రెండు వాహనాలు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి.
ప్రమాద సమయంలో లారీల్లో ఉన్న నలుగురు చిక్కుకుపోయి సజీవదహనమైనట్లు సమాచారం. అదే మార్గంలో వెళ్తున్న వాహనదారులు వెంటనే పోలీసులకు, అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
ఈ ప్రమాదంతో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోగా, పోలీసులు ట్రాఫిక్‌ను మళ్లించి క్రమబద్ధీకరించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, లారీ డ్రైవర్లలో ఒకరు నిద్రమత్తులో ఉండడం వల్లే ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Post a Comment