-->

గుండెలు పగిలే విషాదం.. పవన్ కళ్యాణ్ వీరాభిమాని నిరంజన్ కన్నుమూత

 

గుండెలు పగిలే విషాదం.. పవన్ కళ్యాణ్ వీరాభిమాని నిరంజన్ కన్నుమూత

గుండెలు పగిలే విషాదం.. పవన్ కళ్యాణ్ వీరాభిమాని నిరంజన్ కన్నుమూత

హనుమకొండకు చెందిన ఏపీ ఉప ముఖ్యమంత్రి, సినీ నటుడు Pawan Kalyan వీరాభిమాని పొనుగంటి నిరంజన్ (17) బుధవారం తెల్లవారుజామున హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. గత కొంతకాలంగా అరుదైన జన్యు సంబంధిత న్యూరోమస్క్యులర్ వ్యాధితో బాధపడుతున్న నిరంజన్ ఆరోగ్యం విషమించడంతో తుదిశ్వాస విడిచాడు. అతని మృతితో హనుమకొండలోని హనుమాన్ నగర్‌లో విషాద ఛాయలు అలముకున్నాయి.

కలగానే మిగిలిన 'OG' ముచ్చట

ఇటీవల జూన్ 17న పవన్ కళ్యాణ్ స్వయంగా నిరంజన్ ఇంటికి వెళ్లి అతడిని పరామర్శించారు. మంచానికే పరిమితమైన నిరంజన్‌ను ఆప్యాయంగా హత్తుకుని ధైర్యం చెప్పారు. గతంలో నిరంజన్ పవన్ కళ్యాణ్ పాటలకు చేసిన డాన్స్ వీడియోలు చూసి ఆయన ప్రశంసించారు. తనను అందరూ ప్రేమగా "చోటా గబ్బర్ సింగ్" అని పిలుస్తారని నిరంజన్ చెప్పగా పవన్ ఆనందం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా "మనిద్దరం కలిసి 'OG' సినిమా చూద్దాం. ఒకవేళ 'OG 2' తీస్తే అందులో నువ్వే నా స్పెషల్ గెస్ట్" అంటూ పవన్ కళ్యాణ్ ప్రేమతో మాటిచ్చారు. అలాగే నిరంజన్‌కు పలు బహుమతులతో పాటు తిరుమల శ్రీవారి ప్రసాదాలను కూడా అందించారు.

అయితే ఆ ఆప్యాయ కలయిక జరిగిన కొన్ని రోజులకే నిరంజన్ మృతి చెందడం కుటుంబ సభ్యులతో పాటు పవన్ కళ్యాణ్ అభిమానులను తీవ్ర విషాదంలో ముంచెత్తింది.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793