-->

మాజీ కౌన్సిలర్ ఎస్.కే. మసూద్ అంతిమయాత్రలో భారీగా తరలివచ్చిన ప్రజలు

మాజీ కౌన్సిలర్ ఎస్.కే. మసూద్ అంతిమయాత్రలో భారీగా తరలివచ్చిన ప్రజలు
 మాజీ కౌన్సిలర్ ఎస్.కే. మసూద్ అంతిమయాత్రలో భారీగా తరలివచ్చిన ప్రజలు

భద్రాద్రి కొత్తగూడెం, జూలై 4: భద్రాద్రి కొత్తగూడెం పట్టణానికి చెందిన మాజీ టీడీపీ పట్టణ అధ్యక్షుడు, మాజీ 22వ వార్డు కౌన్సిలర్, కాంగ్రెస్ నాయకుడు ఎస్.కే. మసూద్ అంతిమయాత్ర శనివారం విషాద వాతావరణంలో జరిగింది. ఆయనకు తుది వీడ్కోలు పలికేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు, రాజకీయ నాయకులు, మేయర్, కార్పొరేటర్లు, వివిధ పార్టీల కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు.

కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఎస్.కే. మసూద్ హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం కన్నుమూశారు. అమెరికాలో ఉన్న ఆయన కుమారుడు, కుమార్తె శనివారం ఉదయం స్వదేశానికి చేరుకున్న అనంతరం ముస్లిం సంప్రదాయాల ప్రకారం అంతిమయాత్ర నిర్వహించారు. అనంతరం కొత్తగూడెంలోని ముస్లిం ఖబ్రస్తాన్‌లో ఆయన భౌతికకాయాన్ని ఖననం చేశారు.

ఈ సందర్భంగా పలువురు నాయకులు, సన్నిహితులు మాట్లాడుతూ ఎస్.కే. మసూద్ రాజకీయ నాయకుడిగానే కాకుండా ప్రజల కష్టసుఖాల్లో అండగా నిలిచే సేవాభావం కలిగిన వ్యక్తిగా మంచి గుర్తింపు పొందారని కొనియాడారు. ఎవరికైనా ఆపద వచ్చినా వెంటనే స్పందించి సహాయం చేసే మనస్తత్వం ఆయన ప్రత్యేకత అని పేర్కొన్నారు.

నిరాడంబర స్వభావం, అందరినీ ఆప్యాయంగా పలకరించే తీరు, ప్రజలతో కలిసిమెలిసి ఉండే వ్యక్తిత్వం ఆయనను ప్రత్యేక నాయకుడిగా నిలబెట్టాయని గుర్తు చేశారు. ఆయన మరణంతో కొత్తగూడెం పట్టణం ఓ మంచి నాయకుడిని, సమాజం ఓ సేవాతత్పరుడిని కోల్పోయిందని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు.

"మసూద్ భాయ్ మాకు ఒక అన్న, స్నేహితుడు, మార్గదర్శి. ఆయన లేకపోవడం తీరని లోటు. ఆయన మంచితనం, సేవా గుణం, ఆప్యాయత ఎప్పటికీ మా హృదయాల్లో నిలిచిపోతాయి. భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన జ్ఞాపకాలు చిరస్థాయిగా ఉంటాయి" అంటూ సన్నిహితులు కన్నీరుమున్నీరయ్యారు.

అంతిమంగా అల్లాహ్ ఆయనకు జన్నత్‌లో అత్యున్నత స్థానం ప్రసాదించాలని, ఈ విషాదాన్ని తట్టుకునే ధైర్యం, ఓర్పును కుటుంబ సభ్యులకు ఇవ్వాలని ప్రార్థనలు చేశారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793