-->

త్వరలో క్యూఆర్ కోడ్‌తో కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు.. పంపిణీకి సిద్ధమైన ప్రభుత్వం

 

త్వరలో క్యూఆర్ కోడ్‌తో కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు.. పంపిణీకి సిద్ధమైన ప్రభుత్వం

త్వరలో క్యూఆర్ కోడ్‌తో కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు.. పంపిణీకి సిద్ధమైన ప్రభుత్వం

హైదరాబాద్, జులై 18: తెలంగాణ ప్రభుత్వం కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి సన్నాహాలు పూర్తి చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 1.05 కోట్లకు పైగా కుటుంబాల కోసం క్యూఆర్ కోడ్‌తో రూపొందించిన కొత్త రేషన్ కార్డుల ముద్రణ ఇప్పటికే పూర్తయింది. ఈ కార్డులను జిల్లాలకు కూడా అధికారులు పంపించారు. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పంపిణీ తేదీని ప్రకటించడమే మిగిలి ఉంది. సీఎం ఆమోదం లభించిన వెంటనే రాష్ట్రవ్యాప్తంగా కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం కానుంది.

కొత్త రేషన్ కార్డులను క్రెడిట్, డెబిట్ కార్డు పరిమాణంలో రూపొందించారు. కార్డుపై లబ్ధిదారుడి ఫొటో, పేరు, చిరునామాతో పాటు క్యూఆర్ కోడ్‌ను ముద్రించారు. అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చిత్రాలు కూడా కార్డుపై ఉండనున్నట్లు సమాచారం.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా కాగితపు రేషన్ కార్డులకు బదులుగా స్మార్ట్ కార్డు రూపంలో రేషన్ కార్డులు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం వినియోగంలో ఉన్న కాగితపు కార్డులకు బదులుగా ఈ స్మార్ట్ కార్డులు ఇవ్వనున్నారు.

ఈ కార్డుపై ఉన్న క్యూఆర్ కోడ్‌ను మొబైల్‌తో స్కాన్ చేస్తే లబ్ధిదారుల కుటుంబ సభ్యుల వివరాలతో పాటు ఇప్పటి వరకు తీసుకున్న బియ్యం, చక్కెర, గోధుమలు తదితర రేషన్ సరుకుల వివరాలు కూడా సులభంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. దీంతో రేషన్ పంపిణీలో పారదర్శకత పెరగడంతో పాటు లబ్ధిదారులకు మరింత సౌకర్యం కలగనుంది.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793