-->

మెడికల్ బోర్డుపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించిన కల్వకుంట్ల కవిత

 

మెడికల్ బోర్డుపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించిన కల్వకుంట్ల కవిత

మెడికల్ బోర్డుపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించిన కల్వకుంట్ల కవిత

హైదరాబాద్: సింగరేణి కార్మికుల కోసం నిర్వహించిన మెడికల్ బోర్డును నామమాత్రంగా నిర్వహించి మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికులను మోసం చేసిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు.

సుమారు రెండు వేల మంది కార్మికులు మెడికల్ బోర్డు కోసం ఎదురు చూస్తుండగా, కేవలం 120 మంది కార్మికుల పేర్లు మాత్రమే ప్రకటించారని ఆమె విమర్శించారు. ప్రకటించిన జాబితాలో కూడా 28 మంది కార్మికులకు తమను మెడికల్ బోర్డుకు పిలిచిన విషయమే తెలియలేదని పేర్కొన్నారు. మెడికల్ బోర్డుకు హాజరైన వారిలో కేవలం 20 శాతం మందినే అన్‌ఫిట్‌గా ప్రకటించారని అన్నారు.

సింగరేణిని కాపాడాలన్నా, కార్మికులకు న్యాయం చేయాలన్నా, వారికి భరోసా కల్పించాలన్నా ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని కవిత విమర్శించారు.

సింగరేణి కార్మికుల ఓట్లతో గెలిచిన కాంగ్రెస్ పార్టీ కోల్‌బెల్ట్ ప్రాంత ఎమ్మెల్యేలు సిగ్గుతో తలదించుకోవాలని ఆమె వ్యాఖ్యానించారు. కార్మికులకు అన్యాయం జరుగుతుంటే ఆ ప్రాంత ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. అవసరమైతే ముఖ్యమంత్రిని కలిసి ప్రతినెలా రెండు సార్లు మెడికల్ బోర్డు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

అలాగే, కోల్‌బెల్ట్ ప్రాంత కాంగ్రెస్ ఎమ్మెల్యేలను నిలదీయాలని హెచ్‌ఎంఎస్, తెలంగాణ రక్షణ సేన క్యాడర్‌కు కవిత పిలుపునిచ్చారు. సింగరేణి కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం తెలంగాణ రక్షణ సేన ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆమె హామీ ఇచ్చారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793