-->

మైనర్ బాలికపై లైంగిక దాడి కేసు: కానిస్టేబుల్ వెంకటేష్ అరెస్ట్

 

మైనర్ బాలికపై లైంగిక దాడి కేసు: కానిస్టేబుల్ వెంకటేష్ అరెస్ట్

మైనర్ బాలికపై లైంగిక దాడి కేసు: కానిస్టేబుల్ వెంకటేష్ అరెస్ట్

కొత్తగూడెం, జులై 17: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలికపై లైంగిక దాడి కేసులో మరో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కేసులో A-6 నిందితుడైన బెటాలియన్ కానిస్టేబుల్ వెంకటేష్‌ను అదుపులోకి తీసుకున్నట్లు కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ వెల్లడించారు.

డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. మైనర్ బాలికను కొత్తగూడెం పాత డిపో ప్రాంతంలోని ఓ గదికి తీసుకెళ్లిన సమయంలో, ఆ గదిలో నిందితులకు ఆశ్రయం కల్పించినందుకు వెంకటేష్‌ను కేసులో A-6 నిందితుడిగా చేర్చి అరెస్ట్ చేశారు.

ఈ ఘటనపై బాధితురాలి తల్లి జులై 11, 2026న కొత్తగూడెం 2 టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో లభించిన ఆధారాల మేరకు కానిస్టేబుల్ వెంకటేష్‌ను అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు హాజరుపరిచినట్లు పోలీసులు తెలిపారు.

ఈ కేసులో ఇప్పటికే పలువురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు, మిగిలిన అంశాలపై దర్యాప్తును కొనసాగిస్తున్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793