-->

వైఎస్సార్ జయంతిని ఘనంగా నిర్వహించిన భద్రాద్రి జిల్లా కాంగ్రెస్ నాయకులు

 

వైఎస్సార్ జయంతిని ఘనంగా నిర్వహించిన భద్రాద్రి జిల్లా కాంగ్రెస్ నాయకులు

వైఎస్సార్ జయంతిని ఘనంగా నిర్వహించిన భద్రాద్రి జిల్లా కాంగ్రెస్ నాయకులు

భద్రాద్రి కొత్తగూడెం, జూలై 8: దివంగత మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి గౌస్ మొయినొద్దీన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో నాయకులు వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి ఆయన సేవలను స్మరించుకున్నారు.

ఈ సందర్భంగా గౌస్ మొయినొద్దీన్ మాట్లాడుతూ, వై.ఎస్. రాజశేఖర రెడ్డి 1949 జూలై 8న కడప జిల్లా పులివెందులలో జన్మించారని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2004 నుంచి 2009 వరకు ముఖ్యమంత్రిగా ప్రజలకు విశేష సేవలందించారని గుర్తు చేశారు. రైతు సంక్షేమం కోసం చేపట్టిన పథకాలు, ఆరోగ్యశ్రీ, వ్యవసాయానికి ఉచిత విద్యుత్, 108 అంబులెన్స్ సేవలు వంటి అనేక సంక్షేమ కార్యక్రమాల ద్వారా వైఎస్సార్ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు.

ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగించిన గొప్ప నాయకుడిగా వైఎస్సార్‌ను దేశవ్యాప్తంగా గుర్తిస్తారని, ఆయన ఆశయాలను కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకెళ్తుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో సోషల్ మీడియా పార్లమెంట్ ఇంచార్జ్ మరియు స్టేట్ సెక్రెటరీ వీరాపురం రామ లక్ష్మణ్, రాష్ట్ర ఎస్సీ డిపార్ట్మెంట్ వైస్ చైర్మన్ గడ్డం రాజశేఖర్,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కిసాన్ సెంట్రల్ జిల్లా అధ్యక్షులు ఏలూరి కోటేశ్వరరావు, ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షులు అల్లాడి నరసింహారావు, NSUI జిల్లా అధ్యక్షుడు అజ్మీర సురేష్ నాయక్, మాజీ కౌన్సిలర్ ఎంఏ రజాక్, మాదా శ్రీరాములు, మాజీ ఎంపీటీసీ ఆరిఫ్ ఖాన్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఏవీ కోటిరెడ్డి, గుంటి రామచందర్,కొలిపాక సత్యనారాయణ,రౌతు నిరంజన్,గొడ్డలి యాదగిరి, దుర్గారాశి సమ్మయ్య,గాండ్ల సురేష్,నరసింహారావు, చుంచుపల్లి మండల నాయకులు పెగడ బిక్షపతి, ఆదరి కొమరయ్య, యువజన నాయకులు నయీమ్ తదితరులు పాల్గొని వైఎస్సార్‌కు ఘనంగా నివాళులర్పించారు...

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793