-->

భువనగిరి జిల్లాలో విషాదం.. వివాహిత ఉరి వేసుకుని మృతి

 

భువనగిరి జిల్లాలో విషాదం.. వివాహిత ఉరి వేసుకుని మృతి

భువనగిరి జిల్లాలో విషాదం.. వివాహిత ఉరి వేసుకుని మృతి

భువనగిరి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. వలిగొండ మండలం కాంచనపల్లి గ్రామంలో ఓ వివాహిత ఉరి వేసుకుని మృతి చెందిన ఘటన శనివారం చోటుచేసుకుంది.

గ్రామానికి చెందిన కొలిచిలిమి అశ్విని (27) ఇంట్లో ఉరి వేసుకున్నట్లు సమాచారం. అశ్విని చౌటుప్పల్‌ మండలం దండుమల్కాపూర్‌లో ఏఎన్‌ఎంగా విధులు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ఆమె భర్త మహేశ్‌ ఆర్టీవో ఏజెంట్‌గా పనిచేస్తున్నారు.

అశ్విని మృతికి గల కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు. కుటుంబ సభ్యుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793