ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా TRS కల్వకుంట్ల కవిత శుభాకాంక్షలు
ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా TRS కల్వకుంట్ల కవిత శుభాకాంక్షలు
హైదరాబాద్: ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఆదివాసీ సోదర, సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు. అడవితో మమేకమై జీవిస్తూ.. ప్రకృతి, పర్యావరణ పరిరక్షణలో ఆదివాసీ సమాజం అందిస్తున్న సేవలను ఆమె కొనియాడారు.
ఆదివాసీ సమాజం తరతరాలుగా ప్రకృతిని తమ జీవన విధానంలో భాగంగా చేసుకుని, అడవులు, జల వనరులు, భూమిని కాపాడుతూ వస్తోందని కవిత పేర్కొన్నారు. భారతీయ సమాజానికి తమదైన ప్రత్యేకమైన సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలు, జీవన విలువలను వారసత్వంగా అందిస్తున్న ఆదివాసీల పాత్ర ఎంతో గొప్పదని ఆమె అన్నారు.
ప్రకృతితో సహజీవనం చేస్తూ పర్యావరణ పరిరక్షణకు ఆదివాసీలు అందిస్తున్న కృషి సమాజానికి ఆదర్శంగా నిలుస్తోందని తెలిపారు. వారి సంస్కృతి, సంప్రదాయాలు, భాష, జీవన విధానాలను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.
అదేవిధంగా ఆదివాసీ సమాజానికి సంబంధించిన హక్కులు, ఆత్మగౌరవం, స్వావలంబన కోసం అందరూ ఐక్యంగా ముందుకు సాగాలని కవిత పిలుపునిచ్చారు. ఆదివాసీలకు రాజ్యాంగం కల్పించిన హక్కులు, అవకాశాలు సమర్థవంతంగా అమలయ్యేలా కృషి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ఆదివాసీ సమాజ అభ్యున్నతికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని కోరుతూ.. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా మరోసారి ఆదివాసీ సోదర, సోదరీమణులందరికీ కవిత హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

Post a Comment